
ఓటీటీ

ఒకప్పుడు అగ్ర కథానాయికగా వరుస విజయాలు అందుకున్న కాజల్ అగర్వాల్ ఇప్పుడు తన నటనా ప్రయాణాన్ని కొత్త దిశలో కొనసాగిస్తున్నారు. ఆకర్షణీయ పాత్రలకే పరిమితం కాకుండా, కథకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఆమె నటించిన కొత్త వెబ్ ధారావాహిక విడుదలకు సిద్ధమవుతుండటంతో ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది.
వివాహం, మాతృత్వం తర్వాత కూడా కాజల్ తన సినీ ప్రయాణాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నారు. దర్శకుడు సుధీర్ వర్మ రూపొందిస్తున్న ‘విశాఖ’ వెబ్ ధారావాహికలో ఆమె ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. సాధారణ మహిళగా ప్రారంభమయ్యే ఈ పాత్ర అనూహ్య మలుపులతో సాగుతుందని సమాచారం. యాక్షన్, భావోద్వేగాలు, ఉత్కంఠభరిత అంశాలతో కూడిన ఈ కథలో కాజల్ నటన ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!