
జనరల్

భద్రాచలం వద్ద గోదావరి నది నీటిమట్టం 55 అడుగులకు చేరడంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. వరద ఉద్ధృతి కారణంగా భద్రాచలం నుంచి ఒడిశా, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్‌కు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. గోదావరి ప్రవాహం మరింత పెరిగే అవకాశముందని అధికారులు అప్రమత్తంగా ఉన్నారు.
భద్రాచలం పట్టణంలోకి వరద నీరు ప్రవేశించకుండా ముందస్తు జాగ్రత్తగా మట్టికట్ట ఏర్పాటు చేశారు. పర్ణశాల వద్ద స్నానఘట్టాలు పూర్తిగా నీటమునిగాయి. దుమ్ముగూడెం-భద్రాచలం మధ్య రాకపోకలు నిలిపివేయడంతో ప్రజలు అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని అధికారులు సూచిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండి అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేశారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!