

బాలీవుడ్ స్టార్ నిర్మాత కరణ్ జోహార్‌కు చెందిన ధర్మ ప్రొడక్షన్స్ మలయాళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతూ ‘ఓడియన్: ది ఏజ్ ఆఫ్ ఇల్యూజన్’ అనే ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను ప్రకటించింది. పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్‌తో కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం 19వ శతాబ్దపు కేరళ జానపద కథలు, సాంస్కృతిక గాథల ఆధారంగా రూపొందనుంది. మలయాళ చిత్రసీమలోకి ప్రవేశించడం ఎంతో గర్వకారణమని కరణ్ జోహార్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు.
ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్, మంజు వారియర్ ప్రధాన పాత్రల్లో నటించనున్నారు. జానపద కథలను ఆసక్తికరంగా, ఉత్కంఠభరితంగా తెరపై ఆవిష్కరించడంలో దర్శకుడు రాహుల్ సదాశివన్‌కు ప్రత్యేక నైపుణ్యం ఉందని కరణ్ ప్రశంసించారు. కేరళ పురాణాల్లోని రూపం మార్చుకునే ఓ మాయా శక్తి, శక్తివంతమైన మాతృస్వామ్య కుటుంబంపై ప్రభావం చూపడంతో ప్రారంభమయ్యే ఈ కథ సత్యం, భ్రమల మధ్య జరిగే పోరాటం చుట్టూ సాగనుందని సమాచారం. త్వరలోనే ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కానుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!