

‘మహానటి’ సినిమాతో నేషనల్ అవార్డు అందుకున్న స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ గత కొంతకాలంగా బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాలను అందుకోలేకపోయారు. వరుసగా వచ్చిన చిత్రాలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోవడంతో, ఈసారి పూర్తిగా భిన్నమైన జానర్‌తో మళ్లీ బలమైన రీఎంట్రీ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ పాత్రల నుంచి బయటకు వచ్చి, మొదటిసారిగా కోర్ట్‌రూమ్ డ్రామాలో నటిస్తున్నారు.
‘సత్యవాన్ సావిత్రి’ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ పవర్‌ఫుల్ లాయర్ పాత్రలో కనిపించనున్నారు. ప్రవీణ్ ఎస్. విజయ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో మిస్కిన్ సహా పలువురు ప్రముఖ నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జూలై 24న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుందని కీర్తి సురేష్ అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాతో ఆమె మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కుతారని అభిమానులు ఆశిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!