

‘బేబీ’ చిత్రంతో టాలీవుడ్‌లో ఒక్కసారిగా సెన్సేషన్‌గా మారి ఓవర్‌నైట్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్ వైష్ణవి చైతన్య.. ఇటీవల ‘ఎపిక్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె తన కెరీర్ తొలినాళ్లలో ఎదుర్కొన్న చేదు అనుభవాలను గుర్తుచేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. ముఖ్యంగా ‘బేబీ’ సినిమా విడుదల సమయంలో తనపై వచ్చిన తీవ్ర నెగెటివిటీ గురించి మాట్లాడుతూ.. ఆ సమయంలో తాను ఎంతో మానసిక వేదనకు గురైనట్లు తెలిపారు.
‘బేబీ’తో తనకు ఒక్క రాత్రిలోనే విజయం రాలేదని వైష్ణవి స్పష్టం చేశారు. కవర్ సాంగ్స్, షార్ట్ ఫిలిమ్స్‌తో పాటు పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ ఎంతో కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నానని చెప్పారు. అయితే సినిమా విడుదలైన తర్వాత కొందరు తనను ఉద్దేశించి అసభ్యకరంగా మాట్లాడారని, థియేటర్ల వద్ద తన పోస్టర్లను చెప్పులతో కొట్టడం కూడా చూశానని ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా విజయాన్ని ఆస్వాదించాలా.. లేక తన కష్టానికి ఇలాంటి అవమానాలు ఎదురయ్యాయని బాధపడాలా అనే అయోమయంలోకి వెళ్లిపోయానని చెప్పారు. కాలం గడిచేకొద్దీ ఆ నెగెటివిటీని పట్టించుకోవడం మానేసి, తన పని మరియు సానుకూల అంశాలపైనే దృష్టి పెట్టడం ప్రారంభించానని వైష్ణవి వెల్లడించారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!