

తమిళ చిత్రసీమలో మహిళా పాత్రల రూపకల్పనలో ఇటీవల గణనీయమైన మార్పు కనిపిస్తోంది. హీరోలకు సమానంగా కథలో ప్రాధాన్యం ఉండేలా హీరోయిన్ల పాత్రలను బలంగా తీర్చిదిద్దుతున్నారు. ‘థాయి కిళవి’లో రాధికా శరత్‌కుమార్ పవన్ తాయిగా ఆకట్టుకోగా, ‘విశ్వనాథ్ అండ్ సన్స్’లోనూ సీనియర్ నటీమణికి ప్రాధాన్యమైన పాత్ర దక్కింది. ‘బ్లాస్ట్’లో ప్రీతి ముకుందన్ విభిన్నమైన నటనతో మెప్పించగా, అభిరామి పాత్రను కూడా దర్శకుడు కథకు అనుగుణంగా కీలకంగా తీర్చిదిద్దారు.

‘డీసీ’లో వామికా గబ్బీ పోషించిన చంద్ర పాత్రను దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్ బలంగా ఆవిష్కరించారు. ‘విశ్వనాథ్ అండ్ సన్స్’లో మమితా బైజుకు కూడా నటనకు మంచి అవకాశం ఉన్న పాత్ర లభించడంతో ఆమె మ్యాడీగా తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నారు. అలాగే ‘29’లో ప్రీతి ఆస్రానీ, ‘విత్ లవ్’లో అనశ్వర రాజన్ పోషించిన పాత్రలు కథలో కీలకంగా నిలిచాయి. మహిళా ప్రధాన చిత్రాలకే పరిమితం కాకుండా కమర్షియల్ సినిమాల్లోనూ బలమైన మహిళా పాత్రలకు తమిళ దర్శకులు ప్రాధాన్యం ఇస్తుండటం కొత్త ట్రెండ్‌కు దారితీస్తోంది. ఈ మార్పు నుంచి తెలుగు చిత్ర పరిశ్రమ కూడా స్ఫూర్తి పొందుతుందా అనేది ఆసక్తికరంగా మారింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!