

కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా, గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా చిత్రం టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్ ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. అయితే విడుదలకు కొన్ని గంటల సమయం మాత్రమే ఉన్నప్పటికీ.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం అడ్వాన్స్ బుకింగ్స్ ఇంకా ప్రారంభం కాలేదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు ప్రధాన నగరాల్లో బుక్‌మైషోతో పాటు ఇతర టికెటింగ్ ప్లాట్‌ఫామ్‌లలో కూడా టికెట్లు అందుబాటులోకి రాకపోవడంతో యశ్ అభిమానుల్లో తీవ్ర ఆసక్తి, అసహనం నెలకొంది.
తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల కేటాయింపు, షో టైమింగ్స్, డిస్ట్రిబ్యూటర్లు-థియేటర్ యాజమాన్యాల మధ్య తుది ఒప్పందాలు ఇంకా పూర్తికాకపోవడమే బుకింగ్స్ ఆలస్యానికి కారణమని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అలాగే ప్రత్యేక షోలు, టికెట్ ధరల పెంపునకు సంబంధించిన అనుమతుల ప్రక్రియ కూడా కొనసాగుతున్నట్లు సమాచారం. అవసరమైన ప్రభుత్వ అనుమతులు వచ్చిన తర్వాతే బుకింగ్స్ ప్రారంభించాలని పంపిణీదారులు వేచి చూస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఓవర్సీస్ మార్కెట్లలో అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే జోరుగా సాగుతున్నాయి. బెంగళూరు, ముంబై వంటి నగరాల్లో ఉదయం షోలకూ భారీ డిమాండ్ కనిపిస్తోంది. హైదరాబాద్‌లోని మల్లా రెడ్డి యూనివర్సిటీలో జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్ తర్వాత టాక్సిక్‌పై తెలుగు ప్రేక్షకుల్లో అంచనాలు మరింత పెరిగాయి. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రానికి థియేటర్ల సమస్యలు, అనుమతులపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని, ఆ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో బుక్‌మైషో బుకింగ్స్ ప్రారంభమయ్యే అవకాశముందని పంపిణీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!