

లోకేష్ కనకరాజ్ కథానాయకుడిగా, అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కిన డీసీ చిత్రం ఆగస్టు 7న ప్రేక్షకుల ముందుకొచ్చింది. విభిన్నమైన రస్టిక్ కథనం, ప్రత్యేకమైన యాక్షన్ సన్నివేశాలతో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. రొటీన్ కమర్షియల్ అంశాలకు దూరంగా తెరకెక్కిన ఈ చిత్రంలో లోకేష్ కనకరాజ్ నటన, అరుణ్ మాథేశ్వరన్ మేకింగ్, అనిరుధ్ సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విడుదలైన తర్వాత సినిమాకు మంచి స్పందన రావడంతో పాటు వసూళ్ల పరంగా కూడా సత్తా చాటుతోంది. ఇప్పటికే డీసీ చిత్రంపై పలువురు సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు కూడా సినిమాపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.
డీసీ ఒరిజినల్ అండ్ అవుట్‌స్టాండింగ్ చిత్రమని, సినిమా చాలా కూల్‌గా అనిపించిందని, ప్రతి సన్నివేశాన్ని ఎంతో ఆస్వాదించానని మహేశ్ బాబు ఎక్స్ వేదికగా తెలిపారు. చిత్ర బృందానికి హృదయపూర్వక అభినందనలు అంటూ ఆయన చేసిన ప్రశంసలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.మహేశ్ బాబు నుంచి వచ్చిన ఈ ప్రశంస డీసీ చిత్ర బృందానికి మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది. ఇప్పటికే సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి కొనసాగుతున్న సమయంలో సూపర్ స్టార్ స్పందించడం చిత్రానికి అదనపు ప్రచారంగా మారింది. ముఖ్యంగా సినిమా మేకింగ్, యాక్షన్, సంగీతం గురించి వస్తున్న ప్రశంసలకు మహేశ్ బాబు వ్యాఖ్యలు మరింత బలాన్నిచ్చాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!