

పెళ్లి రోజు సందర్భంగా రామ్ చరణ్, ఉపాసన తమ అభిమానులకు ప్రత్యేక సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఇటీవల జన్మించిన తమ కవల పిల్లల ఫోటోలను ఇప్పటివరకు బయటపెట్టని ఈ జంట, మొదటిసారి సోషల్ మీడియాలో గ్లింప్స్‌ను షేర్ చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక క్యూట్ ఫోటోను పోస్ట్ చేస్తూ ముగ్గురు పిల్లల చిన్న చేతులు కనిపించేలా పంచుకుని, ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఇన్ఫినిటీ ఎమోజీని జత చేశారు. ఈ పోస్ట్ వెంటనే అభిమానుల దృష్టిని ఆకర్షించింది.
ఈ నెల 20, 2023న జన్మించిన పెద్ద కూతురు క్లిన్ కారా కూడా ఈ ఫోటోలో కనిపించడంతో ముగ్గురు పిల్లలు ఒకే ఫ్రేమ్‌లో మొదటిసారి దర్శనమిచ్చారు. కవలల్లో ఒక అబ్బాయి, ఒక అమ్మాయి ఉండగా వారికి శివరామ్, అన్వీరా దేవి అనే పేర్లు పెట్టారు. సెలబ్రిటీలు, నెటిజన్లు ఈ ఫోటోపై ప్రేమాభిమానాలు వ్యక్తం చేస్తూ క్యూట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా, మెగా అభిమానులు పిల్లల ముఖాలను కూడా రివీల్ చేయాలని కోరుతున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!