

తక్కువ సినిమాలతోనే తన అందం, నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న భాగ్యశ్రీ బోర్సే ప్రస్తుతం టాలీవుడ్‌లో వరుస అవకాశాలతో దూసుకెళ్తున్నారు. అక్కినేని అఖిల్‌తో కలిసి నటించిన 'లెనిన్' సినిమా బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకోవడంతో ఆమె క్రేజ్ మరింత పెరిగింది. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో పలు చిత్రాల్లో నటిస్తుండగా, కోలీవుడ్ స్టార్ శివకార్తికేయన్ సరసన 'సెయాన్' చిత్రంలో కనిపించనున్నారు.
ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగ్యశ్రీ తన కెరీర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు ప్రత్యేకంగా డ్రీమ్ రోల్స్ లేదా భారీ టార్గెట్లు లేవని, వచ్చిన అవకాశాలను సంతోషంగా స్వీకరిస్తూ ముందుకు సాగడమే తన విధానమని చెప్పారు. ఎన్ని అవకాశాలు వచ్చినా చివరకు టాలీవుడ్‌లోనే స్థిరపడాలని, తన చివరి సినిమా కూడా తెలుగులోనే చేయాలని ఆకాంక్షించారు. అలాగే రాజమౌళి, సుకుమార్ దర్శకత్వంలో నటించడం తన కల అని వెల్లడించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!