

విక్టరీ వెంకటేశ్ హీరోగా, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న ‘ఆదర్శకుటుంబం’ చిత్రం విడుదల తేదీపై కొత్త వార్తలు సినీ వర్గాల్లో చర్చకు దారితీశాయి. ఇప్పటికే ఈ కాంబినేషన్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కుటుంబ కథలకు వినోదాన్ని జోడించడంలో పేరుపొందిన ఈ ఇద్దరి కలయిక మరోసారి ప్రేక్షకులను అలరించబోతుందనే నమ్మకం అభిమానుల్లో కనిపిస్తోంది.
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 16న విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు టాలీవుడ్లో ప్రచారం జరుగుతోంది. మొదట వేసవి విడుదలను లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, షూటింగ్ ఆలస్యం కారణంగా షెడ్యూల్లో మార్పులు వచ్చినట్లు తెలుస్తోంది. కుటుంబ అనుబంధాలు, వినోదం, భావోద్వేగాలకు సమాన ప్రాధాన్యం ఇస్తూ రూపొందుతున్న ఈ చిత్రం పండుగ సీజన్లో బాక్సాఫీస్ వద్ద భారీ ఆకర్షణగా నిలిచే అవకాశముందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!