

మెంటల్ మదిలో, అలా వైకుంఠపురంలో, రెడ్, పాగల్, ధమాకా వంటి చిత్రాలతో గుర్తింపు పొందిన నటి నివేదా పేతురాజ్ తన జీవితంలోని క్లిష్టమైన దశ గురించి భావోద్వేగంగా మాట్లాడారు. ‘సింగ్ గీతం’ విజయోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె, 2023లో కొన్ని వ్యక్తిగత మరియు వృత్తిపరమైన కారణాల వల్ల సినిమాలకు పూర్తిగా దూరం కావాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా అన్నింటినీ వదిలేసి హిమాలయాలకు వెళ్లిపోవాలనే ఆలోచన కూడా వచ్చినట్లు తెలిపారు.
ఆ సమయంలో దర్శకుడు నాగ్ అశ్విన్ తనకు ఎంతో మద్దతుగా నిలిచారని, తన జీవితానికి కొత్త దిశ చూపించారని నివేదా పేర్కొన్నారు. ‘సింగ్ గీతం’ ద్వారా మళ్లీ ప్రేక్షకుల ముందుకు రావడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. వ్యక్తిగత జీవితంలో ఎదురైన కొన్ని పరిణామాలు, గతంలో ప్రకటించిన ప్రేమ వ్యవహారం ముగిసిన విషయాలను కూడా ఆమె ప్రస్తావించారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!