
జనరల్

బెళగావి శివం అసోసియేట్స్ పెద్ద మొత్తంలో డిపాజిట్లు సేకరించి మోసానికి పాల్పడిన కేసులో సీఐడీ దర్యాప్తు వేగవంతం చేసింది. గత డిసెంబరులో జరిగిన కన్నడ ఉత్సవంలో పాల్గొన్న నటులు ‘డాలి’ ధనుంజయ, వశిష్ఠ సింహ, సప్తమీ గౌడ, రాగిణి ద్వివేది తదితరులకు భారీ పారితోషికాలు ఇచ్చారనే అనుమానాలతో వారికి నోటీసులు జారీ చేయడానికి అధికారులు సిద్ధమయ్యారు.
అలాగే సంస్థ యజమాని శివానంద నీలణ్ణవర్‌పై రూ.2,400 కోట్ల మోసం ఆరోపణలు ఉన్నాయి. 40,700 మంది నుంచి డిపాజిట్లు సేకరించగా, వాటిలో పెద్ద మొత్తాన్ని షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టి నష్టపోయినట్లు విచారణలో తేలింది. సన్నీ లియోన్‌కు కూడా రూ.కోటి పారితోషికం ఇచ్చినట్లు రికార్డులు చూపుతున్నాయి. ఇప్పటికే కొన్ని ఆస్తులు జప్తు చేసిన అధికారులు, మిగిలిన నగదును తిరిగి మదుపుదారులకు చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!