

ఆస్కార్ 2027 కోసం భారత్ తరఫున ఏ సినిమా అధికారిక ఎంట్రీగా నిలుస్తుందనే ఉత్కంఠకు తెరపడింది. 99వ అకాడమీ అవార్డ్స్‌లో బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ విభాగానికి మరాఠీ చిత్రం ‘గోంధల్’ను భారత అధికారిక ఎంట్రీగా ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎంపిక చేసింది. దేశవ్యాప్తంగా వచ్చిన 33 చిత్రాలను పరిశీలించిన అనంతరం దర్శకుడు సంతోష్ దావఖర్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ఎంపిక చేసినట్లు FFI ప్రకటించింది.
మహారాష్ట్ర గ్రామీణ ప్రాంతాల నేపథ్యంలో తెరకెక్కిన ‘గోంధల్’.. అక్కడి సంప్రదాయ గోంధల్ ఆచారం, జానపద కళారూపాన్ని కథలో కీలకంగా మలిచింది. కొత్తగా పెళ్లైన జంట చుట్టూ ఒక రాత్రిలో జరిగే సంఘటనలతో కథ సాగుతూ సంప్రదాయాలు, సంబంధాలు, కోరికలు, మోసం వంటి అంశాలను ప్రస్తావిస్తుంది. ఇషితా దేశ్‌ముఖ్, కిశోర్ కదమ్, యోగేశ్ సోహోని తదితరులు నటించిన ఈ చిత్ర దర్శకుడు సంతోష్ దావఖర్ 2025లో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో బెస్ట్ డైరెక్టర్‌గా సిల్వర్ పీకాక్ అవార్డును అందుకున్నారు. 99వ అకాడమీ అవార్డుల వేడుక 2027 మార్చి 14న లాస్ ఏంజెల్స్‌లో జరగనుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!