

సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో గ్లోబల్ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ చిత్రం వారణాసిపై భారీ అంచనాలు ఉన్నాయి. భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాను ఐమ్యాక్స్ ప్రెజెంటేషన్‌కు అనుగుణంగా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. షూటింగ్‌ను అక్టోబర్‌లో పూర్తి చేస్తామని చిత్రబృందం గతంలో వెల్లడించింది.
అయితే తాజా సమాచారం ప్రకారం అక్టోబర్ మొత్తం షూటింగ్ చేయాల్సిన అవసరం లేకుండా, మొదటి వారానికే చిత్రీకరణను పూర్తి చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. షూటింగ్ పూర్తైన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగం పుంజుకోనున్నాయి. ఎం.ఎం. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం వారణాసి ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే విడుదల తేదీకి సంబంధించిన అధికారిక ప్రకటనను చిత్రబృందం నుంచి నిర్ధారించాల్సి ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!