

కొద్ది రోజుల విరామం అనంతరం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మళ్లీ షూటింగ్‌లతో బిజీ అయ్యారు. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఫౌజీ’ తాజా షెడ్యూల్‌లో ఆయన పాల్గొనడంతో చిత్రీకరణ వేగం అందుకుంది. ఇటలీ పర్యటన ముగించుకుని హైదరాబాద్‌కు చేరుకున్న ప్రభాస్ నేరుగా షూటింగ్‌లో చేరారు. ఈ నెల మొత్తం ‘ఫౌజీ’ చిత్రానికే కేటాయిస్తూ కీలక సన్నివేశాలను పూర్తి చేయాలని చిత్రబృందం ప్రణాళిక రూపొందించింది.
అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రత్యేకంగా నిర్మించిన భారీ సెట్‌లో ప్రస్తుతం షూటింగ్ కొనసాగుతోంది. స్వాతంత్ర్యానికి ముందు జరిగిన సంఘటనల నేపథ్యంలో రూపొందుతున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో ఇమాన్వి కథానాయికగా నటిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఇంకా సుమారు 50 రోజుల షూటింగ్ మిగిలి ఉంది. ప్రకటించినట్లుగానే డిసెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని చిత్రబృందం లక్ష్యంగా పెట్టుకుంది.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!