

ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఫౌజీ’ చిత్రబృందం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది. అభిమానులు గ్లింప్స్ లేదా టీజర్ కోసం ఎదురుచూసినా, మేకర్స్ పోస్టర్‌తోనే సరిపెట్టారు. పోస్టర్‌లో చార్మినార్ సమీపంలో గాంధీజీ నడుచుకుంటూ వెళ్తుండగా, మరోవైపు ఒంటిపై రక్తంతో ప్రభాస్ కనిపించారు. అయితే ఆయన ముఖాన్ని మాత్రం చూపించలేదు. ‘‘స్వాతంత్య్రం ఒక వేడుకగా మారకముందు అది ఒక పోరాటం. మన రేపటి కోసం పోరాడిన ప్రతి సైనికుడికి సెల్యూట్’’ అంటూ చిత్రబృందం పోస్టర్‌ను పంచుకుంది.
‘సీతారామం’ తర్వాత హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన ఇమాన్వి హీరోయిన్‌గా నటిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఇది ప్రీ-పీరియడ్ యాక్షన్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్నట్లు పోస్టర్లను బట్టి తెలుస్తోంది. ‘ఫౌజీ’ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 3, 2026న థియేటర్లలో విడుదల కానుంది. ఇటీవల ప్రభాస్ తన ఇన్‌స్టాగ్రామ్ డీపీగా ‘ఫౌజీ’ పోస్టర్‌ను పెట్టడంతో సినిమాపై అభిమానుల్లో మరింత ఆసక్తి పెరిగింది.

















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!