

కొరగజ్జ చిత్ర దర్శకుడు సుధీర్ అత్తవర్కు నిర్మాత త్రివిక్రమ సాపల్య అరుదైన బహుమతిని అందించారు. గత మూడు సంవత్సరాలుగా ఈ చిత్రం కోసం ఆయన చేసిన కృషిని గుర్తిస్తూ సుమారు రూ.1.75 కోట్ల మార్కెట్ విలువ గల విలాసవంతమైన త్రిబుల్ బెడ్రూం ఫ్లాట్‌ను బహుమతిగా ఇచ్చారు. జనవరిలో విడుదల కావాల్సిన ఈ చిత్రాన్ని చివరి నిమిషంలో త్రీడీ ఫార్మాట్‌లోకి మార్చాలని నిర్ణయించడంతో విడుదలను వాయిదా వేశారు. ప్రస్తుతం కొచ్చి, చెన్నైలో త్రీడీ పనులు వేగంగా జరుగుతున్నాయి.
ఈ చిత్రం ఇప్పటికే ఆరు భాషల్లో రూపొందుతుండగా, ఇప్పుడు అస్సామీ, చైనీస్, ఆంగ్ల భాషల్లో కూడా విడుదలకు సిద్ధమవుతోంది. హాంకాంగ్, బీజింగ్ సహా పలు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి పంపిణీదారులు ఆసక్తి చూపుతున్నట్లు నిర్మాత తెలిపారు. రూ.40 కోట్లకు పైగా బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఆగస్టులో విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. దర్శకుడి నూతన గృహ ప్రవేశ వేడుక సందర్భంగా బెంగళూరులో ‘అగేలు సేవ’ కార్యక్రమం నిర్వహించగా, నటి భవ్య పాల్గొని తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!