

విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటించిన తాజా చిత్రం ‘రణబాలి’. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించారు. విజయదశమి సందర్భంగా అక్టోబర్ 16న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 8న హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి విజయ్ దేవరకొండ, దర్శకుడు రాహుల్ సంకృత్యాన్, నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్ హాజరయ్యారు.
మరో సినిమా షూటింగ్‌లో బిజీగా ఉండటంతో రష్మిక ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు. ఈ విషయాన్ని వెల్లడించిన విజయ్.. రష్మిక తరఫున అభిమానులకు క్షమాపణలు తెలిపారు. అనంతరం యాంకర్ సూచనతో ఆమెకు ఫోన్ చేయగా, రష్మిక కాల్ లిఫ్ట్ చేయలేదు. షూటింగ్‌లో బిజీగా ఉండటం వల్లే ఆమె ఫోన్ ఎత్తలేదని విజయ్ చెప్పారు. మరోసారి ఫోన్ చేసినప్పుడు మాట్లాడుదామని పేర్కొన్నారు.























కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!