
బిజినెస్

ఆంధ్రప్రదేశ్ ఏఐ ఆధారిత జీఎస్టీ నిర్వహణ విధానానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. 57వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఏఐ సాంకేతికతను ఉపయోగిస్తూ పన్ను నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచేందుకు రాష్ట్రం అనుసరిస్తున్న విధానాన్ని కేంద్రం ప్రశంసించినట్లు సమాచారం. జీఎస్టీ వ్యవస్థను మరింత సమర్థంగా నిర్వహించేందుకు ఏఐ వినియోగం చేస్తున్న తీరును సమావేశంలో ప్రస్తావించారు.
ఏపీ అమలు చేస్తున్న జీఎస్టీ మోడల్‌ను ఇతర రాష్ట్రాల్లోనూ అనుసరించాలని సూచించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలు ఏపీ జీఎస్టీ మోడల్‌పై అధ్యయనం చేస్తున్నట్లు సమాచారం. ఏఐ ఆధారిత విధానాల ద్వారా పన్ను వ్యవస్థలో పారదర్శకతను పెంచడంతో పాటు అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు, పన్ను వసూళ్లను మెరుగుపరిచేందుకు చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!