
జనరల్

ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసురాలు ఎం.ఎస్. సుబ్బులక్ష్మి జీవిత కథ ఆధారంగా ఓ బయోపిక్ తెరకెక్కనున్నట్లు గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. గౌతమ్ తిన్ననూరి ఈ ప్రాజెక్ట్‌కు దర్శకత్వం వహించనున్నారని సమాచారం. ఈ బయోపిక్‌లో నటించేందుకు మొదట సాయిపల్లవి, రుక్మిణీ వసంత్ వంటి పలువురి పేర్లు వినిపించిన విషయం తెలిసిందే.
తాజాగా ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ కోసం రష్మిక మందన్నా పేరు పరిశీలనలోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఆమెతో కథా చర్చలు పూర్తయ్యాయని, ఎం.ఎస్. సుబ్బులక్ష్మి పాత్ర కోసం ఇప్పటికే లుక్ టెస్ట్ కూడా చేసినట్లు ప్రచారం జరుగుతోంది. త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం రష్మిక ‘మైసా’, ‘రణబాలి’, ‘కాక్‌టెయిల్ 2’ వంటి చిత్రాలతో బిజీగా ఉన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!