
గాసిప్స్

సికింద్రాబాద్‌లోని అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే మద్రాస్ రెజిమెంట్‌లో ఆయుధాలు చోరీకి గురైనట్లు వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది. రెజిమెంట్‌లోని ఓ గది తాళం పగలగొట్టి ఆయుధాలను ఎత్తుకెళ్లినట్లు ఆర్మీ అధికారులు గుర్తించారు. ఈ ఘటనపై బొల్లారం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు ప్రకారం మొత్తం 12 ఆయుధాలు మాయమైనట్లు సమాచారం. వీటిలో నాలుగు ఏకే-47 రైఫిళ్లు, ఆరు పిస్టల్స్, ఒక ఇన్సాస్ రైఫిల్‌తో పాటు పెద్ద మొత్తంలో మందుగుండు సామగ్రి ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్మీ అధికారుల ఫిర్యాదుతో బొల్లారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల విచారణ అనంతరం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!