
జనరల్

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించిన ‘గుంటూరు కారం’ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించగా, ఎస్.ఎస్. తమన్ సంగీతం అందించారు. ఈ చిత్రంలోని ‘కుర్చీ మడతపెట్టి’ పాట విడుదలైనప్పటి నుంచి భారీ సంచలనం సృష్టించింది. వివాదాలు ఎదురైనా వాటిని అధిగమించి ఈ పాట సెన్సేషన్ హిట్గా నిలిచింది.
తాజాగా ఈ పాట తెలుగులో అత్యంత వేగంగా 800 మిలియన్ వ్యూస్ సాధించిన పాటగా కొత్త రికార్డు సృష్టించింది. మహేష్ బాబు, శ్రీలీల ఎనర్జిటిక్ డ్యాన్స్ ప్రేక్షకులను ఆకట్టుకోగా, తమన్ అందించిన మాస్ బీట్ ప్రత్యేకంగా నిలిచింది. త్వరలోనే 1 బిలియన్ వ్యూస్ చేరుకుంటుందని అభిమానులు, విశ్లేషకులు భావిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!