

సుప్రీం హీరో సాయిదుర్గా తేజ్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘సంబరాల ఏటి గట్టు’ విడుదలకు సిద్ధమవుతోంది. రోహిత్ కేపీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కే నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు. ఐశ్వర్య లక్ష్మి కథానాయికగా నటిస్తున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం సినిమా చివరి దశకు చేరుకోగా, హైదరాబాద్‌లో చివరి షెడ్యూల్ ప్రారంభమైంది.
1940ల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సాయితేజ్ శక్తిమంతమైన యోధుడి పాత్రలో కనిపించనుండగా, సంజయ్ దత్ ప్రతినాయక ఛాయలున్న పాత్రను పోషిస్తున్నట్లు సమాచారం. భారీ సెట్లో సాయితేజ్, సంజయ్ దత్‌లపై యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. జగపతిబాబు, శ్రీకాంత్, సాయికుమార్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు. డిసెంబరులో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!