

కేజీఎఫ్ స్టార్ యశ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ప్రతిష్ఠాత్మక పాన్-ఇండియా చిత్రం ‘టాక్సిక్’ నుంచి ప్రత్యేక మేకింగ్ వీడియో విడుదలైంది. దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం ఈ వీడియోను విడుదల చేసి అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వైరల్ అవుతోంది. ఇందులో భారీ యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్న తీరు, నటీనటుల నుంచి నటనను రాబట్టే విధానం, చిత్ర నిర్మాణాన్ని సమర్థంగా నడిపిస్తున్న శైలి ఆకట్టుకుంటున్నాయి.
ఈ వీడియోతో పాటు దర్శకురాలికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రత్యేక సందేశాన్ని కూడా చిత్రబృందం విడుదల చేసింది. ఈ చిత్రం ఎంత భారీ స్థాయిలో నిర్మితమవుతోందో మేకింగ్ దృశ్యాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. యశ్‌తో పాటు నయనతార, కియారా అద్వానీ, హ్యూమా ఖురేషి, రుక్మిణీ వసంత్, తారా సుతారియా కీలక పాత్రలు పోషిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అంతర్జాతీయ స్థాయిలో మంచి స్పందన లభించడంతో విడుదల తేదీని వాయిదా వేసి, కొత్త తేదీని త్వరలో ప్రకటించనున్నట్లు సమాచారం.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!