

సూపర్ స్టార్ రజినీకాంత్ తన సినీ ప్రయాణానికి ముందు బస్ కండక్టర్‌గా పనిచేసిన రోజులను గుర్తుచేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. ‘జైలర్ 2’కు సంబంధించి నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన తన గత అనుభవాలను అభిమానులతో పంచుకున్నారు. సినిమాలంటే తనకు ప్రాణమని చెబుతూనే, ఐదేళ్ల పాటు కండక్టర్‌గా పనిచేసిన రోజులతో తనకు విడదీయలేని అనుబంధం ఉందని తెలిపారు. బెంగళూరుకు వెళ్లిన ప్రతిసారీ పాత జ్ఞాపకాలు గుర్తుకొస్తాయని, బస్సులను చూసినప్పుడు అప్పటి రోజులు కళ్లముందు కదలాడతాయని పేర్కొన్నారు.
76 ఏళ్ల వయసులోనూ హీరోగా సినిమాలు ఎలా చేస్తున్నారని చాలామంది అడుగుతుంటారని రజినీకాంత్ చెప్పారు. తనను ఈ స్థాయికి తీసుకొచ్చింది తమిళ ప్రజల ప్రేమ, ఆదరణేనని పేర్కొంటూ ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. వారి మద్దతు వల్లే పెద్ద నిర్మాణ సంస్థలు తనతో సినిమాలు చేసేందుకు ముందుకు వస్తున్నాయని, నెల్సన్ దిలీప్ కుమార్ వంటి ప్రతిభావంతులైన దర్శకులతో కలిసి పనిచేసే అవకాశం లభిస్తోందని అన్నారు. ఆయన భావోద్వేగ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘జైలర్ 2’ అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!