

తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో హీరోయిన్‌గా నటించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటి లయ, కెరీర్ మంచి దశలో ఉండగానే వివాహం చేసుకుని సినిమాలకు దూరమయ్యారు. చాలా సంవత్సరాల విరామం తర్వాత మళ్లీ రీ-ఎంట్రీ ఇచ్చిన ఆమె ప్రస్తుతం వరుస చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న లయ, వయసు పెరిగినా తన అందం, ఫిట్‌నెస్‌ను ఎలా కాపాడుకుంటున్నారో వెల్లడించారు.
పెళ్లికి ముందు చాలామంది అమ్మాయిలు ఫిట్‌నెస్‌పై శ్రద్ధ చూపుతారని, కానీ పెళ్లి తర్వాత అదే క్రమశిక్షణ కొనసాగించరని లయ అన్నారు. తాను కూడా కొంతకాలం జిమ్, వ్యాయామాలకు దూరమయ్యానని తెలిపారు. అయితే ఆరోగ్యంగా, అందంగా ఉండాలంటే వ్యాయామం తప్పనిసరి అని గ్రహించి మళ్లీ ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టానన్నారు. ప్రస్తుతం డాన్స్ రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నానని, జిమ్‌కు వెళ్లలేకపోయినా డాన్స్‌ను మాత్రం ఎప్పటికీ మాననని చెప్పారు. డాన్స్ చేయడం వల్ల మనసు ఉల్లాసంగా ఉండటమే కాకుండా శరీరానికి మంచి వ్యాయామం కూడా అవుతుందని ఆమె వివరించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!