

నిర్మాత నాగవంశీ రూపొందించిన ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ చిత్రంతో ‘బేబీ’ జంట ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. నూతన దర్శకుడు ఆదిత్య హాసన్ తెరకెక్కించిన ఈ రొమాంటిక్ కామెడీ థియేటర్లలో ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. ఇప్పుడు ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో నేటి నుంచి స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. అయితే ఓటీటీ విడుదలకు ముందు ప్లాట్‌ఫామ్‌లో కనిపించిన టైటిల్ అందరి దృష్టిని ఆకర్షించింది. అసలు టైటిల్‌కు బదులుగా ‘ఎపిక్ క్లాసిక్ – ఫస్ట్ సెమిస్టర్’ అని జాబితాలో కనిపించడం ఆసక్తికరంగా మారింది.
టైటిల్‌లో వచ్చిన ఈ అనూహ్య మార్పు సాంకేతిక పొరపాటా, లేక ఉద్దేశపూర్వకంగా చేసిన మార్పా అనే చర్చ మొదలైంది. థియేటర్లలో విడుదలైన వెర్షన్‌తో పోలిస్తే ఓటీటీ వెర్షన్‌లో అదనపు సన్నివేశాలు లేదా మరో కట్ ఉంటుందా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ మార్పుపై చిత్రబృందం లేదా నెట్‌ఫ్లిక్స్ నుంచి స్పష్టత రావాల్సి ఉంది. నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందించారు. ఈ సినిమా పలు భాషల్లో నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి వచ్చింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!