

కన్నడ స్టార్ హీరో యష్, కియారా అద్వానీ జంటగా నటిస్తున్న భారీ యాక్షన్ చిత్రం ‘టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్, పాటలపై మిశ్రమ స్పందన వ్యక్తమైంది. ముఖ్యంగా కియారా అద్వానీపై వచ్చిన ట్రోలింగ్‌పై యష్ పలుమార్లు స్పందిస్తూ విమర్శకులకు గట్టి సమాధానం ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 26న సినిమా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా కియారా ‘టాక్సిక్’లో తన అనుభవాన్ని పంచుకుంటూ, ఈ చిత్రం తనకు కొత్త విషయాలను నేర్చుకునే అవకాశం కల్పించిందని తెలిపారు.
సినిమా చిత్రీకరణ సమయంలో నీటితో నిండిన పెద్ద ట్యాంక్‌లో ఉన్న ఫొటోను కియారా పంచుకున్నట్లు సమాచారం. కొత్త పాత్రలు, సవాళ్లు మన సామర్థ్యాలను తెలుసుకునేలా చేస్తాయని, భయం ఉన్నా ధైర్యంగా ముందుకు సాగినప్పుడే ఎదుగుదల సాధ్యమవుతుందని ఆమె పేర్కొన్నారు. అలవాటు లేని పరిస్థితులను స్వీకరించడం, ప్రశాంతంగా ఉండటం ‘టాక్సిక్’ తనకు నేర్పిన విషయాలని చెప్పారు. ఈ చిత్రంలో నయనతార, హుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అండర్‌వరల్డ్ నేర ప్రపంచం నేపథ్యంలో గ్యాంగ్‌స్టర్ కథగా సినిమా రూపొందుతున్నట్లు తెలుస్తోంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!