
క్రీడలు

వచ్చే ఏడాది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌ను సందర్శించే అవకాశముందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో వెల్లడించారు. ఈ పర్యటన భారత్-అమెరికా ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం కొత్త దశలోకి అడుగుపెట్టే అవకాశముందని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రధాని నరేంద్ర మోదీ, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య ఉన్న సాన్నిహిత్యం ద్వైపాక్షిక సంబంధాలకు బలమైన పునాది అని రూబియో తెలిపారు. ఈ సానుకూల సంబంధాలు వాణిజ్యం, భద్రత, సాంకేతికతతో పాటు పలు కీలక రంగాల్లో సహకారాన్ని మరింత విస్తరించేందుకు దోహదపడతాయని ఆయన అన్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!