

టాలీవుడ్ క్రేజీ దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సూర్య హీరోగా నటించిన ఈ సినిమాలో మమత బైజు హీరోయిన్గా కనిపించగా, సీనియర్ నటి రాధిక శరత్‌కుమార్ కీలక పాత్రలో నటించారు. పాజిటివ్ టాక్‌తో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. ఈ నేపథ్యంలో వెంకీ అట్లూరి వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ సినిమా విశేషాలతో పాటు నటీనటులతో తనకున్న అనుబంధాన్ని కూడా పంచుకుంటున్నారు.
తాజా ఇంటర్వ్యూలో రాధిక శరత్‌కుమార్ గురించి మాట్లాడుతూ.. ఆమె గొప్ప నటి అని, తమ సినిమాలో ఆమె పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నానని వెంకీ తెలిపారు. ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ షూటింగ్ సమయంలోనే రాధిక ‘తాయ్ కిళవి’ చిత్రంలో కూడా నటించారని చెప్పారు. ఆ సినిమా గురించి, తన పాత్రకు సంబంధించిన మేకప్, ఇతర విషయాల గురించి రాధిక తరచూ చెప్పేవారని వెల్లడించారు. కొన్ని వీడియోలు చూపించడంతో తాను ఆశ్చర్యపోయానని అన్నారు. టీజర్ డబ్బింగ్ సమయంలో రాధిక హైదరాబాద్‌లో ఉన్నప్పుడు ‘తాయ్ కిళవి’ విడుదలైందని, తెలుగులో విడుదల కాకపోయినా కొన్ని థియేటర్లలో తమిళంలో ప్రదర్శించారని తెలిపారు. దీంతో రాధికతో కలిసి ఆ సినిమాను థియేటర్లో చూసినట్లు చెప్పిన వెంకీ.. అది తనకు గొప్ప అనుభవమని, రాధిక అద్భుతంగా నటించారని ప్రశంసించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!