

విజయ్ ఆంటోనీ నటిస్తున్న తాజా చిత్రం ‘అప్పకుట్టి’ విడుదలకు సిద్ధమైంది. ప్రతిభావంతుడైన దర్శకుడు ము. మారన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా తండ్రీకూతుళ్ల మధ్య ఉండే బలమైన అనుబంధం, భావోద్వేగ బంధం నేపథ్యంలో రూపొందుతున్న యాక్షన్ ఫ్యామిలీ డ్రామా. ఈ చిత్రంలో విజయ్ ఆంటోనీ హీరోగా నటించడంతో పాటు తన మల్టీ టాలెంట్‌ను మరోసారి చూపిస్తున్నారు. సినిమాకు సంగీతం అందించడంతో పాటు ఎడిటింగ్ బాధ్యతలను కూడా స్వయంగా నిర్వహిస్తున్నారు. విజయ్ ఆంటోనీ సరసన ప్రీతి అస్రానీ హీరోయిన్‌గా నటిస్తుండగా లితాన్య, భగవతి పెరుమాళ్, హరిప్రియ ఇసై, అరువి మదన్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ఇప్పటికే సినిమా నిర్మాణ కార్యక్రమాలన్నీ పూర్తికావడంతో ‘అప్పకుట్టి’ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని హీరో విజయ్ ఆంటోనీ తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. దసరా పండుగ కానుకగా అక్టోబర్ 16, 2026న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో ఈ సినిమాపై అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!