
జనరల్

తెలుగు సినీ పరిశ్రమలో తనదైన గుర్తింపు తెచ్చుకుంటున్న నటి రాశి సింగ్‌కు మరో క్రేజీ అవకాశం వచ్చినట్లు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. పోస్టర్, శశి, ప్రేమ్ కుమార్, భూతద్దం భాస్కర్ నారాయణ, ప్రసన్న వదనం, సంతాన ప్రాప్తిరస్తు చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరైన ఆమె, ఇటీవల ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు సినిమాలో వడ్డే నవీన్ సరసన నటించింది.
తాజా సమాచారం ప్రకారం, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న కొత్త చిత్రంలో కీలక పాత్ర కోసం రాశి సింగ్‌ను చిత్ర బృందం సంప్రదించినట్లు తెలుస్తోంది. ఈ అవకాశానికి ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!