

దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’పై ఇటీవల పలు ఊహాగానాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చిత్ర నిర్మాణ వ్యయం భారీగా పెరిగిందని, ప్రాజెక్ట్ అనుకున్న దానికంటే ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటోందని ప్రచారం జరిగినప్పటికీ, సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ వార్తల్లో వాస్తవం చాలా తక్కువగా ఉందని తెలుస్తోంది.
రాజమౌళి తనకు సొంతమైన ప్రణాళికాబద్ధమైన విధానంలో చిత్ర నిర్మాణాన్ని కొనసాగిస్తున్నట్లు సమాచారం. అవసరమైన చోట మాత్రమే భారీ వ్యయం చేస్తూ, మిగిలిన అంశాల్లో ఖర్చులను నియంత్రించేలా వ్యూహం అమలు చేస్తున్నారని చెబుతున్నారు. నిర్మాణ వ్యవహారాల్లో కార్తికేయ కూడా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారని, ఆర్థిక వ్యవహారాలపై నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోందని సమాచారం. మహేష్ బాబు కెరీర్‌లోనే అత్యంత భారీ చిత్రంగా రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!