

సినిమాల్లో సన్నిహిత సన్నివేశాల చిత్రీకరణలో ఇంటిమసీ డైరెక్టర్లు, కోఆర్డినేటర్ల ప్రాధాన్యం పెరుగుతున్న తీరుపై దర్శకుడు విశాల్ భరద్వాజ్ స్పందించారు. తన కెరీర్ తొలినాళ్లలో ఇలాంటి సన్నివేశాలను చిత్రీకరించేటప్పుడు ఎదురైన ఇబ్బందులను ఆయన గుర్తుచేసుకున్నారు. అప్పట్లో ఇంటిమసీ కోఆర్డినేటర్లు సాధారణం కాకపోవడంతో నటీమణులు సన్నివేశాల గురించి కొన్ని విషయాలు నేరుగా దర్శకుడిని అడిగేవారని, వాటిని సహనటుడికి చెప్పాల్సి వచ్చేదని తెలిపారు. అలాంటి సందర్భాల్లో పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉండేదని భరద్వాజ్ పేర్కొన్నారు.
ఇక రాబోయే నెట్‌ఫ్లిక్స్ ఆంథాలజీ ‘లస్ట్ స్టోరీస్ 3’లో తన దర్శకత్వం వహించిన భాగం చిత్రీకరణ మాత్రం గతంతో పోలిస్తే సులువుగా సాగిందని చెప్పారు. నిజ జీవితంలో భార్యాభర్తలైన అదితి రావు హైదరి, సిద్ధార్థ్ కలిసి నటించడం వల్ల ఇద్దరూ ఒకరితో ఒకరు సౌకర్యంగా ఉన్నారని, దాంతో సగం ఇబ్బందికర పరిస్థితులు తొలగిపోయాయని వివరించారు. షూటింగ్ సమయంలో బాడీ డబుల్స్‌ను ఉపయోగించేందుకు కూడా వారు అంగీకరించలేదని విశాల్ భరద్వాజ్ తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!