
జనరల్

‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో టాలీవుడ్‌లో సెన్సేషన్‌గా మారిన పాయల్ రాజ్‌పుత్ ప్రస్తుతం ‘వెంకటలచ్చిమి’ అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తోంది. ముని దర్శకత్వంలో సినిమా టికెట్ ఎంటర్‌టైన్మెంట్స్, అర్జున్ ఆర్ట్స్ బ్యానర్లపై రాజా, ఎన్ఎస్ చౌదరి నిర్మిస్తున్న ఈ చిత్రం పవర్‌ఫుల్ యాక్షన్ రివెంజ్ డ్రామాగా రూపొందుతోంది. ఇది తెలుగు సహా మొత్తం ఆరు భాషల్లో విడుదల కానుంది.
తాజాగా ఈ సినిమాపై పాయల్ స్పందిస్తూ, సినిమా కోసం తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని తెలిపింది. బిగ్ స్క్రీన్‌పై ప్రేక్షకులు తనను ఎప్పుడు చూస్తారా అని తానే ఎదురుచూస్తున్నానని చెప్పింది. మరో 10–15 రోజుల్లో తన నుంచి ఒక పెద్ద అప్డేట్ రానుందని ఆమె వెల్లడించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!