

‘కేజీఎఫ్’ సిరీస్‌లతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన యశ్ నటిస్తున్న తాజా పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ విడుదల తేదీని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. పలుమార్లు వాయిదా పడిన ఈ భారీ ప్రాజెక్ట్‌ను ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన కొత్త పోస్టర్లో యశ్ రెండు భిన్నమైన లుక్స్‌లో కనిపిస్తూ అభిమానుల్లో ఆసక్తిని మరింత పెంచారు.
పీరియాడిక్ గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. కియారా అద్వానీ, నయనతార, రుక్మిణి వసంత్, హ్యూమా ఖురేషీ, తారా సుతారియా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఓనం, ఈద్, రక్షాబంధన్ పండుగలతో పాటు లాంగ్ వీకెండ్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ విడుదల తేదీని ఖరారు చేసినట్లు చిత్ర వర్గాలు తెలిపాయి. కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!