

బుల్లితెర రియాలిటీ షో ‘బిగ్‌బాస్ తెలుగు సీజన్-10’ కోసం ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ఈ సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అక్కినేని నాగార్జున ఇటీవల ప్రోమో షూట్‌ను పూర్తి చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పదో సీజన్‌ను గత సీజన్ల కంటే మరింత గ్రాండ్‌గా, కొత్త తరహాలో రూపొందిస్తున్నామని తెలిపారు. గత సీజన్‌కు ప్రేక్షకుల నుంచి వచ్చిన విశేష ఆదరణను దృష్టిలో పెట్టుకుని ఈసారి ఫిజికల్ టాస్కులను మరింత సవాల్‌గా రూపొందించినట్లు వెల్లడించారు.
షోలో పోటీదారులు హద్దులు దాటి, క్రమశిక్షణ లేకుండా ప్రవర్తిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోనని నాగార్జున స్పష్టం చేశారు. అలాగే తన 100వ సినిమా గురించి కూడా అప్‌డేట్ ఇస్తూ, ప్రస్తుతం చిత్రీకరణ వేగంగా జరుగుతోందని, త్వరలోనే ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేస్తామని తెలిపారు. ఈ వ్యాఖ్యలు అభిమానుల్లో షోతో పాటు ఆయన కొత్త సినిమాపై కూడా ఆసక్తిని పెంచాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!