
జనరల్

డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో జీ5 మరోసారి భారీ కంటెంట్ లైనప్‌ను ప్రకటించింది. తెలుగు సహా 7 భారతీయ భాషల్లో సినిమాలు, వెబ్ సిరీస్‌లు, లైవ్ స్పోర్ట్స్, కృత్రిమ మేధ (AI) ఆధారిత ప్రాజెక్టులతో కూడిన కొత్త ప్రణాళికలను సంస్థ వెల్లడించింది. ప్రముఖ నిర్మాణ సంస్థలతో భాగస్వామ్యాలు కుదుర్చుకుని ప్రేక్షకులకు మరింత వైవిధ్యమైన వినోదాన్ని అందించనున్నట్లు తెలిపింది.
తెలుగు విభాగంలో ‘ఎన్‌బీకే111’, వెంకటేష్-అనీల్ రావిపూడి చిత్రం, ‘వృషకర్మ’ వంటి సినిమాలతో పాటు ‘శ్రీమతి’, ‘అబ్జెక్షన్ మై లార్డ్’ వంటి ఒరిజినల్ సిరీస్‌లు కూడా ఉన్నాయి. అన్నపూర్ణ స్టూడియోస్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ వంటి ప్రముఖ సంస్థలతో కలిసి జీ5 ముందుకు సాగుతోంది. హిందీతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, మరాఠీ, బెంగాలీ భాషల్లోనూ కొత్త ప్రాజెక్టులను సిద్ధం చేస్తోంది.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!