
జనరల్

ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ఫాంటసీ డ్రామా ‘హౌస్ ఆఫ్ ది డ్రాగన్’ సీజన్ 3 జూన్ 22 నుంచి స్ట్రీమింగ్‌కు రానుంది. టార్గారియన్ వంశానికి సంబంధించిన ఈ ఎపిక్ కథను భారతీయ ప్రేక్షకులు జియోసినిమా వేదికగా వీక్షించవచ్చు. అద్భుతమైన విజువల్స్, రాజకీయ వ్యూహాలు, అధికార పోరు, డ్రాగన్ల మధ్య జరిగే భారీ యుద్ధాలు ఈ సీజన్‌కు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.
తాజా సమాచారం ప్రకారం తొలి ఎపిసోడ్ నిడివి సుమారు 64 నిమిషాలు ఉండనుంది. భారత కాలమానం ప్రకారం ఉదయం 6:30 గంటలకు స్ట్రీమింగ్ ప్రారంభమవుతుంది. మొత్తం ఎనిమిది ఎపిసోడ్లతో రూపొందిన ఈ సీజన్‌లో ప్రతి సోమవారం కొత్త ఎపిసోడ్ విడుదల కానుంది. తెలుగు డబ్బింగ్‌తో పాటు పలు భాషల్లో అందుబాటులోకి రానుండటంతో భారతీయ ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!