

పాప్ సంగీత ప్రపంచాన్ని శాశ్వతంగా మార్చిన లెజెండరీ గాయకుడు మైఖేల్ జాక్సన్ జీవిత కథ ఆధారంగా రూపొందిన హాలీవుడ్ బయోపిక్ ‘మైఖేల్’ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రానుంది. థియేటర్లలో మంచి ఆదరణ పొందిన ఈ చిత్రం ఆగస్టు 29 నుంచి జియోహాట్‌స్టార్‌లో ఇంగ్లీష్, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ప్రముఖ దర్శకుడు ఆంటోయిన్ ఫుక్వా తెరకెక్కించిన ఈ సినిమాలో మైఖేల్ జాక్సన్ మేనల్లుడు జాఫర్ జాక్సన్ ప్రధాన పాత్రలో నటించి తన నటనతో విశేష ప్రశంసలు అందుకున్నారు.
ఈ చిత్రంలో జో జాక్సన్ పాత్రలో కోల్‌మన్ డొమింగో, కేథరిన్ జాక్సన్ పాత్రలో నియా లాంగ్ కనిపించారు. ఇప్పటివరకు అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆపిల్ టీవీ వంటి ప్లాట్‌ఫారమ్‌లలో రెంటల్ విధానంలో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ సినిమా, ఇప్పుడు జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రైబర్లకు అదనపు చార్జీలు లేకుండా అందుబాటులోకి రానుంది. దీంతో మైఖేల్ జాక్సన్ జీవితాన్ని మరింత మంది ప్రేక్షకులు మరోసారి ఆస్వాదించే అవకాశం లభించనుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!