
బిజినెస్

సినీ ప్రియులకు మరో వారం కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లతో సందడి చేయనుంది. థియేటర్లలో న్యాచురల్ స్టార్ నాని నటించిన భారీ అంచనాల చిత్రం ‘ది ప్యారడైజ్’ ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో పాటు రాగ్ మయూర్ ప్రధాన పాత్రలో నటించిన ‘అనుమాన పక్షి’ కూడా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ రెండు చిత్రాలపై తెలుగు ప్రేక్షకుల్లో ఇప్పటికే ఆసక్తి నెలకొంది.
ఇక ఓటీటీ విషయానికొస్తే ఈ వారం పలు కొత్త చిత్రాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు రానున్నాయి. తెలుగు హారర్ థ్రిల్లర్ ‘అగధ’, పరిణీతి చోప్రా నటిస్తున్న ‘ది సీక్రెట్ ఆఫ్ ట్రస్ట్’, హిందీ చిత్రం ‘హుంకార్: ది రోర్’, మలయాళ చిత్రం ‘మ్యాంగో పచ్చా’తో పాటు పలు హాలీవుడ్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు కూడా ప్రేక్షకులను అలరించనున్నాయి. దీంతో వివిధ భాషలు, జానర్లలో కొత్త కంటెంట్ కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ వారం ఆసక్తికరంగా ఉండనుంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!