

సూర్య, మమిత బైజు జంటగా నటించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రాధిక శరత్ కుమార్ కీలక పాత్రలో నటించగా, జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించారు. నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు సమాచారం. ప్రస్తుతం కూడా సినిమా మంచి వసూళ్లను రాబడుతోంది.
ఇక ఈ సినిమా ఓటీటీ విడుదల కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు ఆసక్తికరమైన అప్‌డేట్ వినిపిస్తోంది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. థియేట్రికల్ విడుదలైన నెల రోజుల తర్వాత సినిమాను ఓటీటీలోకి తీసుకురావాలని ఒప్పందం కుదిరినట్లు సమాచారం. ఈ లెక్కన సెప్టెంబర్ 14 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!