
రాజకీయాలు

దేశవ్యాప్తంగా ఉల్లిపాయల ధరలు గణనీయంగా పెరిగాయి. పలు ప్రాంతాల్లో కిలో ఉల్లి ధర రూ.50 దాటగా, కొరత ఎక్కువగా ఉన్న కొన్ని రాష్ట్రాల్లో రూ.60కుపైగా పలుకుతోంది. ధరల పెరుగుదలతో వినియోగదారులపై భారం పెరుగుతోంది. సరఫరా లోటును తగ్గించి ధరలను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలకు సిద్ధమవుతోంది.
ఉల్లి కొరత ఉన్న ప్రాంతాలకు సరఫరాను మెరుగుపరిచేందుకు కేంద్రం ‘కందా ఎక్స్‌ప్రెస్’ రైళ్లను నడపనున్నట్లు తెలిపింది. ఈ రైళ్ల ద్వారా ఉల్లిపాయలను వేగంగా తరలించడంతో పాటు, ధరలను అదుపులోకి తీసుకురావడానికి కేంద్ర బఫర్ నిల్వల నుంచి ఉల్లిని విడుదల చేయనుంది. మార్కెట్‌లో సరఫరా పెంచడం ద్వారా ధరలు తగ్గేలా చర్యలు చేపడుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!