
బిజినెస్

పశ్చిమ బెంగాల్ పోలీసులు టీఎంసీకి చెందిన మరో 12 బ్యాంకు ఖాతాలను శుక్రవారం స్తంభింపజేశారు. ఇప్పటికే రూ.440 కోట్ల నిధులు ఉన్న మూడు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఖాతాలను పరిమితంగా నిర్వహించేందుకు కోల్‌కతా హైకోర్టు అనుమతి ఇచ్చిన మరుసటి రోజే ఈ చర్యలు చోటుచేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ కొత్తగా నిలిపివేసిన ఖాతాలు పలు పబ్లిక్ మరియు ప్రైవేట్ బ్యాంకులకు చెందినవిగా అధికారులు వెల్లడించారు.
ఈ పరిణామంతో మొత్తం రూ.1000 కోట్లకు పైగా డిపాజిట్లు ఉన్నట్లు ఆరోపణలు ఉన్న 15 బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్ అయినట్లైంది. కోర్టు అనుమతించిన మూడు ఖాతాల నిర్వహణ కోసం రిటైర్డ్ జస్టిస్ సుబ్రతా తాలుక్‌దార్‌ను ప్రత్యేక అధికారిగా నియమించారు. పార్టీ రోజువారీ ఖర్చులు, సిబ్బంది జీతాలు, న్యాయ వ్యయాలకు మాత్రమే ఆయన సంతకం చేసిన చెక్కుల ద్వారా నిధులు వినియోగించాల్సి ఉంటుంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!