
క్రీడలు

సినీ నిర్మాత బండ్ల గణేశ్ బీఆర్ఎస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. పక్క పార్టీల ఎమ్మెల్యేలను లాక్కోవడమే రాజకీయమా అని ప్రశ్నిస్తూ.. బీఆర్ఎస్ నాయకుల రాజకీయ తీరుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ప్రస్తుతం రాజకీయంగా బలహీనపడిపోయిందని వ్యాఖ్యానించిన ఆయన.. ఆ పార్టీకి కాంగ్రెస్ మరింత గట్టి ఎదురుదెబ్బ ఇస్తుందని అన్నారు.
ప్రజల నుంచి పుట్టిన పార్టీ కాంగ్రెస్ అని బండ్ల గణేశ్ పేర్కొన్నారు. తెలంగాణలో రాబోయే పదేళ్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగుతారని, రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని ఆయన అన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం పనిచేస్తున్నందున కాంగ్రెస్ పార్టీ ప్రతిరోజూ మరింత బలపడుతోందని బండ్ల గణేశ్ పేర్కొన్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!