
సినిమాలు

డీఎస్సీ అంశంపై వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ఐదోసారి సవాల్ విసిరారు. “టైమ్, డేట్ నువ్వే ఫిక్స్ చెయ్. చర్చకు నేను సిద్ధం” అని అన్నారు. శనివారం విజయనగరంలో నిర్వహించిన టీడీపీ కార్యకర్తల సమావేశంలో ఆయన పార్టీ కేడర్‌కు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు.
టీడీపీకి కార్యకర్తలే వెన్నెముక అని లోకేశ్ పేర్కొన్నారు. కష్టపడి పనిచేసే కార్యకర్తలకు సముచిత స్థానం కల్పించే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. కార్యకర్తల సంక్షేమం కోసం రూ.160 కోట్లు ఖర్చు చేసిన ఏకైక పార్టీ టీడీపీ అని తెలిపారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేస్తూ, త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి మంచి ఫలితాలు సాధించేలా పార్టీ శ్రేణులు కృషి చేయాలని సూచించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!