
జనరల్

ఢిల్లీలో పర్యటనలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, జీవన్ రెడ్డి పార్టీ ఫిరాయింపుల అంశంపై స్పందించారు. జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయబోనని, వ్యక్తిగత విమర్శలకు దిగడం తనకు ఇష్టం లేదని ఆయన స్పష్టం చేశారు.
అయితే, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేటీ రామారావు పలువురు నాయకులను మోసం చేశారని ఆయన విమర్శించారు. పార్టీ కోసం కష్టపడిన దేవేందర్ గౌడ్, ఈటల రాజేందర్, విజయశాంతి, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు వంటి నాయకులను పక్కన పెట్టారని ఆయన అన్నారు. జూపల్లి ఓటమి తర్వాత హర్షవర్ధన్‌ను పార్టీలోకి తీసుకువచ్చినా, ఆయనకు వార్డు సభ్యుడి పదవి కూడా ఇవ్వలేదని ఆయన గుర్తు చేశారు.


















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!