
జనరల్

పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై తీవ్ర విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ బీజేపీ చెప్పినదే మాట్లాడుతున్నారని, ఆయన ఒక “తోలుబొమ్మలా” వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణను కించపరిచే వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు కేటీఆర్, హరీష్ రావు ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు.
తెలంగాణ ఉద్యమంపై, రాష్ట్ర ఆవిర్భావంపై పవన్ చేసిన వ్యాఖ్యలపై కూడా ఆయన స్పందించారు. తెలంగాణ ఎలా ఏర్పడిందో తెలుసుకోవాలని, సినిమా డైలాగులతో రాజకీయాలు నడవవని వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ తెలంగాణకు రావడాన్ని ఎవరూ ఆపలేదని, సినిమా నటుడిగా వస్తే ఆతిథ్యం ఇస్తానని కూడా అన్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!