
ఆరోగ్యం

రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా కేంద్ర ప్రభుత్వం వివక్ష లేకుండా నిధులు మంజూరు చేస్తోందని ఎంపీ ఈటల రాజేందర్ పేర్కొన్నారు. సోమవారం ప్రజాభవన్‌లో సీఎం రేవంత్ రెడ్డి ఎంపీలతో నిర్వహించిన సమావేశంలో ఆయనతో పాటు కొండా విశ్వేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. పెండింగ్‌లో ఉన్న అంశాలపై చర్చిస్తూ కేంద్ర నిధుల కేటాయింపుపై వివరణ ఇచ్చారు.
కేంద్రం నిధులు అందిస్తున్నప్పటికీ భాజపా ఎంపీలు వాటిని తీసుకురావడం లేదని విమర్శించడం తగదని ఆయన అన్నారు. రేషన్ కార్డుదారులందరికీ ఆయుష్మాన్ భారత్ పథకం అమలు చేయాలని, 70 ఏళ్లు పైబడిన వారికి వయ వందన ఆరోగ్య పథకం అందించాలని సూచించారు. ధాన్యం సేకరణలో కేంద్రంపై పూర్తిగా ఆధారపడకుండా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని సూచించారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!